News April 4, 2025
కామవరపుకోట: కడుపునొప్పి తాళలేక మహిళ ఆత్మహత్య

కామవరపుకోట మండలం ఉప్పలపాడులో గురువారం గంగాభవానీ అనే వివాహిత కడుపునొప్పి తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త, పిల్లలతో కలిసి ఇటీవల భవానీ పుట్టింటికి వచ్చింది. గత కొంతకాలంగా ఆమె కడుపు నొప్పితో బాధపడుతోందని, బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు గంగాభవాని తండ్రి సూర్యనారాయణ తెలిపారు.
Similar News
News March 1, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 1)

* 1901: ఆంధ్రరాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1951: బిహారీ సీఎం నితీశ్ కుమార్ జననం (ఫొటోలో)
* 1955: తెలుగు భాషావేత్త వెలమల సిమ్మన్న జననం
* 1986: సింగర్ ఎన్.సీ.కారుణ్య జననం
* 1989: మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మరణం
* ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
* జీరో డిస్క్రిమినేషన్ డే
News March 1, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 1, 2026
NZB: డీసీఎం ఢీకొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వ్యాను ఢీ కొట్టింది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పరుశురాం సదా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు SHO తెలిపారు.


