News July 8, 2025

కామవరపుకోట: బస్సు ఢీకొని ఒకరు మృతి

image

కామవరపుకోట మండలం తడికలపూడి శ్రీనివాస వేబ్రిడ్జి వద్ద మంగళవారం జరిగిన యాక్సిడెంలో ఒకరు మృతి చెందారు. ఓ ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Similar News

News July 8, 2025

VJA: కదంభ ప్రసాదం ప్రత్యేకత ఏంటో తెలుసా?

image

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ జులై 8, 9, 10 తేదీల్లో శాకంబరి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా తయారుచేసే కదంభ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. పప్పు, బియ్యం, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ ప్రసాదంలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈవో శీనా నాయక్ ప్రసాద పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News July 8, 2025

మోస్ట్ వ్యాల్యుబుల్ టీమ్‌గా RCB

image

ఐపీఎల్‌ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మోస్ట్ వ్యాల్యుబుల్ టీమ్‌గా అవతరించింది. ఈ ఏడాది 12.2 శాతం విలువ పెరిగి $269 మిలియన్లతో అత్యంత విలువైన జట్టుగా నిలిచింది. $249 మిలియన్లతో MI రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత $235 మిలియన్లతో CSK మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యు రూ.1.58 లక్షల కోట్లుగా ఉంది.

News July 8, 2025

సిరిసిల్ల: 48 మంది నిందితులకు జైలు శిక్ష: ఎస్పీ

image

ఆరు నెలల్లో 48 కేసులలో నిందితులుగా ఉన్న వారికి శిక్ష పడినట్లు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గితే తెలిపారు. సిరిసిల్లలోని ఎస్పీ కార్యాలయంలో నిందితులకు శిక్ష పడలే చేసిన పీపీలు, కానిస్టేబుల్‌లకు సోమవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసుల్లో నేరస్థులకు శిక్ష పడేలా చేయడం, శిక్షణ శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు.