News December 10, 2025
కామారెడ్డిలో ఎన్నికల ముచ్చట్లు

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో 156 గ్రామాల్లో సర్పంచ్ పదవికి 727 మంది, 1084 వార్డులకు 3048 మంది పోటీ పడుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకోగా.. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. మూడో విడతో 168 పంచాయతీలకు గానూ 26 సర్పంచులు ఏకగ్రీవం కాగా, 142 సర్పంచ్ స్థానాలకు 442 మంది బరిలో ఉన్నారు.
Similar News
News December 10, 2025
ఓయూకు రూ.1000 కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయిస్తూ CM రేవంత్ రెడ్డి జీవో విడుదల చేశారు. ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఆయన విద్యార్థులకు ఈ నిధులను అంకితం చేశారు. క్యాంపస్‌లో మౌలిక వసతులు, మెరుగైన విద్య, నూతన భవనాల నిర్మాణాలు, విద్యార్థుల కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఈ డబ్బు భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం వినియోగించాలని <<18476536>>CM<<>> పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడొద్దనేది తన సంకల్పం అన్నారు.

ప్రేమ పేరుతో మోసం చేసిందని మహిళా డీఎస్పీపై ఫిర్యాదు

రాయ్‌పూర్ డీఎస్పీ కల్పన వర్మ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బిజినెస్‌మ్యాన్ దీపక్ టాండన్ కేసు పెట్టారు. 2021లో ప్రేమ పేరుతో రిలేషన్‌షిప్‌లోకి దింపి, బ్లాక్‌మెయిల్ చేసి తన నుంచి రూ.2 కోట్ల డబ్బు, డైమండ్ రింగ్, కారు, గోల్డ్ చైన్, లగ్జరీ గిఫ్ట్స్, తన హోటల్ ఓనర్‌షిప్ రాయించుకున్నట్టు ఆరోపించారు. క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలను కల్పన వర్మ ఖండించారు.