News April 8, 2025
కామారెడ్డిలో కల్తీ కల్లు తాగి 58 మందికి అస్వస్థత

కల్తీ కల్లు తాగి 58 మంది అస్వస్థతకు గురైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం రామరంచ గ్రామాలకు చెందిన 58 మంది సోమవారం కల్లు దుకాణాల్లో కల్తీ కల్లు తాగారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది వెంటనే 46 బాన్సువాడ ఆసుపత్రికి, 12 మందిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 8, 2025
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి: నరసింహస్వామి

మహబూబాబాద్ జిల్లాలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నరసింహస్వామి తెలిపారు. 2024-2025 సంవత్సరానికి గాను జిల్లాలో చదువుతున్న (SC,ST,BC,OC,EBC) విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈనెల 31 లోపు https://www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News April 8, 2025
లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే కోరం, కలెక్టర్

టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో మంగళవారం సన్న బియ్యం లబ్ధిదారుడైన గుమ్మడి సురేశ్- శశికల దంపతుల ఇంట్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, డీఎస్పీ చంద్రభాను భోజనం చేశారు. అనంతరం వారితో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఆ కుటుంబానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
News April 8, 2025
NLR: పోలీసులపై పర్వత రెడ్డి విమర్శలు

నెల్లూరు జిల్లా పోలీసులు అనాలోచితంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏదో రకంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందన్నారు. నాయకులకే రక్షణ లేకపోతే ప్రజల సంగతి ఏంటని ప్రశ్నించారు.