News September 6, 2025
కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభ

కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15న జరగనున్న ఈ సభలో బీసీ డిక్లరేషన్ అమలు, అసెంబ్లీలో 42% రిజర్వేషన్లపై తీర్మానం చేసిన సందర్భంగా సంబరాలు జరుపుకోనున్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. ఈ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాసంలో శనివారం జరిగింది.
Similar News
News September 6, 2025
లిక్కర్ కేసు: ముగ్గురు నిందితులకు బెయిల్

AP: లిక్కర్ కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. విజయవాడ ఏసీబీ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ముగ్గురూ పాస్‌పోర్టు వివరాలు అందించాలంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఓటు వేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రాగా, ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు.
News September 6, 2025
SIIMA అవార్డు అందుకున్న మాధవధార హీరో

దుబాయ్ వేడుకగా జరిగిన SIIMA అవార్డులో మాధవధారకు చెందిన హీరో పేడాడ సందీప్ సరోజ్‌కు అవార్డు లభించింది. కమిటీ కుర్రోలు చిత్రంతో పేడాడ సందీప్ సరోజ్ ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ చిత్రానికి గానూ బెస్ట్ డెబ్యూట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలిపారు. సందీప్ సరోజ్ తల్లి రమణకుమారి విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
News September 6, 2025
SKLM: ‘యూరియా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలి’

యూరియా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఎరువులపై తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్.ఐ.లు, వ్యవసాయ శాఖ పలు శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎరువులకు సంబంధించి డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, డీఎస్పీ, వ్యవసాయ శాఖ ఏడీ ఉంటారన్నారు. ప్రతీ మండలంలో రెవెన్యూ, పోలీసు వ్యవసాయశాఖ ఏఓ మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ ఉంటుందని చెప్పారు.