News February 14, 2026
కామారెడ్డిలో కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’

కామారెడ్డి మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, DCC చీఫ్ మల్లికార్జున్ సమక్షంలో ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరికలతో కాంగ్రెస్ బలం 21కి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్‌కు ఇంకా 4 సభ్యుల మద్దతు అవసరం ఉంది. MP ఎక్స్ అఫీషియో ఓటును కలుపుకొన్నా, మరో ముగ్గురు కౌన్సిలర్ల మద్దతు ఉంటేనే కాంగ్రెస్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.
Similar News
News April 5, 2026
భారత ఎగుమతులపైనా యుద్ధ ప్రభావం: సెంట్రల్ కామర్స్ సెక్రెటరీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారత ఎగుమతులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని సెంట్రల్ కామర్స్ సెక్రెటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ‘ఇప్పటికే దిగుమతులపై ప్రభావం పడింది. వెస్ట్ ఏషియా కూడా ముఖ్యమైన మార్కెట్. ఎగుమతుల్లో 12-13% అక్కడికే వెళ్తున్నాయి. వీటిపై యుద్ధ ప్రభావం ఎంతనేది 2-3 వారాల్లో స్పష్టత వస్తుంది. అన్ని రంగాల్లో ఇబ్బందులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.
News April 5, 2026
మెదక్: 3 నెలల రేషన్.. 30 వరకు పంపిణీ

మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల సన్న బియ్యం సరఫరా జరుగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లబ్ధిదారులు తొందరపడకుండా ఈ నెల 30 వరకు సమీప రేషన్ దుకాణాల్లో సరుకులు పొందాలని సూచించారు. సరుకుల కొరత లేదని, పారదర్శకంగా పంపిణీ జరుగుతుందని చెప్పారు. వదంతులు నమ్మకుండా అవసరమైతే అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
News April 5, 2026
అనంత జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు

సీఎం చంద్రబాబు ఈనెల 6న అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం పర్యటన షెడ్యూల్ వెల్లడించారు. ఉదయం 11:10 గంటలకు యాడికి మండలం వేములపాడుకు చేరుకొని మార్కెట్ యార్డ్‌లో జరిగే ‘ప్రజా వేదిక’లో పాల్గొంటారు. మధ్యాహ్నం పెండేకల్లు రిజర్వాయర్ వద్ద నీటి సంరక్షణ పనులను పరిశీలిస్తారు. అనంతరం వేములపాడులో కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం 4:20 గంటలకు తిరిగి అమరావతికి పయనమవుతారు.


