News May 11, 2024
కామారెడ్డిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
కామారెడ్డిలో గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. అక్కన్నపేట, మిర్జాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న పట్టాల పక్కన మృతదేహం లభ్యమైనట్లు రైల్వే సిబ్బంది సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించిన ఎస్ఐ మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
Similar News
News January 20, 2025
తెలంగాణాలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత: TPCC ఛీఫ్
తెలంగాణాలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని TPCC అధ్యక్షుడు, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో నూతన క్రీడా విధానంపై మెల్బోర్న్ అధికారులతో చర్చించామన్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు జితేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
News January 20, 2025
నిజామాబాద్‌లో ప్రజావాణి రద్దు
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నేడు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున తిరిగి జనవరి 27 నుంచి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.
News January 20, 2025
NZB: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు వీరే!
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకునే వారి వివరాలు ఇవే. HM కేటగిరీలో బాలచంద్రం(రాకాసిపేట్), శ్రీనివాస్ (పెర్కిట్), SAల్లో కృష్ణారెడ్డి (గూపన్పల్లి), అరుణశ్రీ(కంజర), ఆరోగ్యరాజ్ (గుండారం), సతీశ్ కుమార్ వ్యాస్(బినోల), గోవర్ధన్ (మామిడిపల్లి), హన్మంత్ రెడ్డి (జానకంపేట్), SGTల్లో శ్రీనివాస్(వేంపల్లి), రాధాకృష్ణ (నర్సాపూర్), సాయిలు (కొత్తపల్లి) ఉన్నారు.