News January 9, 2026
కామారెడ్డిలో దొంగల బీభత్సం

కామారెడ్డిలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి ఐదు దుకాణాల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.. నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో శుక్రవారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని, రాత్రిపూట గస్తీ ముమ్మరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News January 11, 2026
నల్గొండ: గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

పట్టణంలోని రాంనగర్‌లో SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ హౌస్ వైరింగ్ కోర్సులో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ సంచాలకులు సియాజీ రాయ్ తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండకు చెందిన 19 నుంచి 45 ఏళ్లలోపు పురుషులు అర్హులని, ఆసక్తి గల వారు జనవరి 18 లోపు సంస్థలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9701009265 సంప్రదించాలన్నారు.
News January 11, 2026
సెంచరీ భాగస్వామ్యం.. ఫస్ట్ వికెట్ డౌన్

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఎట్టకేలకు భారత బౌలర్ హర్షిత్ రాణా తొలి వికెట్ తీశారు. 62 పరుగులు చేసిన నికోల్స్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ఓపెనర్లిద్దరూ అర్ధసెంచరీలతో తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. NZ స్కోరు 23 ఓవర్లలో 122/1. క్రీజులో కాన్వే(54), యంగ్(3) ఉన్నారు.
News January 11, 2026
మన ఊరు.. ఫస్ట్ విజువల్ ఏంటి..?

ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం ఊరిని వీడిన వారంతా పండగకు తిరిగి వచ్చేస్తున్నారుగా! సొంతూరు ఆలోచన రాగానే గుడి, చదివిన బడి, ఆడుకున్న చెట్టు, వీధి చివర షాపు, మన పొలం, ఊరి చెరువు.. ఇలా ఓ స్పెషల్ విజువల్ మన మైండ్‌లోకి వస్తుంది. ఎప్పుడు ఊరికొచ్చినా ఆ ప్లేస్‌కు వెళ్లడమో, దాని అప్డేట్ తెలుసుకోవడమో పక్కా. మన ఊర్లో మీకున్న ఆ ప్లేస్ ఏంటి? ఈ ఆర్టికల్‌ను మన ఊరి గ్రూప్స్‌లో షేర్ చేయండి, కామెంట్ చేయండి.


