News March 23, 2024

కామారెడ్డిలో బాలికతో వ్యభిచారం..!

image

తల్లిదండ్రులు లేని ఓ మైనర్ బాలికతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భీంగల్‌కు చెందిన సంపంగి లక్ష్మి, ఆమెతో సహజీవనం చేస్తున్న సుంకరి శంకర్‌ ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సహకరిస్తున్న లాడ్జి ఓనర్ నరసింహరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరణ ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 15, 2026

NZB: అక్కడ పోలీసులకు ఏం పని? : MP అర్వింద్

image

BRS కార్పొరేటర్ ఇంటి దగ్గర మీ ACP, నలుగురు SI లు ఏం చేస్తున్నారు?, అక్కడ వారికి ఏం పని’ అని MP అర్వింద్ ధర్మపురి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. BRS కార్పొరేటర్‌ను ఎత్తుకెళ్లేందుకు సాయం చేస్తున్నారా గడ్డి మేపుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పోలీస్ డిపార్ట్‌మెంట్ కాంగ్రెస్‌కు సేవ చేసేందుకు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 15, 2026

NZB: 500 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం

image

నిజామాబాద్ నగరంలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందన ఈ దేవాలయంలోని శివలింగం స్వయంభూగా భావిస్తారు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం నిత్యం విశేష పూజలందుకుంటుంది. రథసప్తమి రోజున సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడటం ఇక్కడి ప్రత్యేకత. శివరాత్రి పర్వదినాన్ని ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు.

News February 15, 2026

ఆర్మూర్: ఆధ్యాత్మిక నిలయం.. ఆర్మూర్ సిద్ధులగుట్ట!

image

ఆర్మూర్ పట్టణానికి తలమానికం నవనాథ సిద్ధులగుట్ట. వందల ఏళ్ల క్రితం నవనాథులు ఇక్కడి గుహల్లో సిద్ధేశ్వరుడిని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో దీనికి ‘సిద్ధులగుట్ట’ అని పేరు వచ్చింది. తొమ్మిది మంది సిద్ధులలో ముగ్గురు ఇక్కడే ఉండటంతో, నవనాథపురం కాస్తా ‘ఆరు.. మూడు..’ అంటూ కాలక్రమేణా ఆర్మూర్‌గా మారింది. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధమైన రాళ్లతో వెలిసిన ఈ క్షేత్రం నేడు ఆధ్యాత్మిక ల్యాండ్‌మార్క్‌గా విరాజిల్లుతోంది.