News November 9, 2025

కామారెడ్డిలో మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా..!

image

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800 కాగా, చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.250, లైవ్ కోడి కిలో రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో మాంసం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని విక్రయదారులు చెప్పారు.

Similar News

News November 9, 2025

సింగ‌రేణి ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

image

సింగ‌రేణి సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఇంట‌ర్న‌ల్ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త అందింది. సంస్థ‌లో ఖాళీగా ఉన్న ప‌లు ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టుల‌ను అంతర్గత అభ్యర్థుల‌తో భ‌ర్తీ చేసేందుకు యాజమాన్యం స‌ర్క్యుల‌ర్ జారీ చేసింది. అర్హత గల ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 24వ తేదీ లోగా ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాలని, సంస్థ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరింది.

News November 9, 2025

మల్కాపురంలో యువకుడి మృతి

image

మల్కాపురంలోని ఓ బార్‌లో పనిచేసే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని బార్‌లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి బార్‌ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 9, 2025

కామారెడ్డి: అగ్రి ఎంప్లాయిస్ యూనియన్ కార్యవర్గం ఎన్నిక

image

కామారెడ్డి జిల్లాలో వివిధ విత్తనాల క్రిమిసంహారక మందుల కంపెనీల్లో పని చేసే మార్కెట్ ఉద్యోగులు అందరూ కలసి కార్యవర్గం ఎన్నుకున్నారు. 40 మంది సభ్యులతో యూనియన్ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా నగేష్, ఉపాధ్యక్షుడిగా అనిల్, క్యాషియర్ ప్రణయ్, కార్యదర్శిగా నాగరాజులను నియమించారు. మార్కెట్ రంగాల్లో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక ఇబ్బదులు ఎదుర్కొని అందరూ కలిసికట్టుగా ఉండాలని వారు సూచించారు.