News January 30, 2025
కామారెడ్డిలో మహిళ మృతదేహం కలకలం

కామారెడ్డిలో రైల్వే స్టేషన్ ఎదురుగా గల ఇందిరా చౌక్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ పట్టణంలో భిక్షాటన చేసుకొని బతికేది. కాగా నిన్న సాయంత్రం ఇందిరా చౌక్ పై పడుకున్న ఆమె అక్కడే మృతి చెందింది. మృతదేహన్ని ఆస్పత్రికి తరలించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News March 2, 2026
కడప జిల్లాలో 34 సెంటర్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు.!

కడప జిల్లాలో సోమవారం నుంచి 34 సెంటర్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 5,884 మంది రెగ్యులర్, 619 మంది సప్లిమెంటరీ, మొత్తం 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సోమవారం ఇంగ్లిష్ పరీక్షకు 5,424 మంది విద్యార్థులు హాజరయ్యారు. 635 మంది ఆబ్సెంట్ అయ్యారు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరు, కమలాపురంలోని 34 ప్రభుత్వ హైస్కూళ్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
News March 2, 2026
ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

భువనగిరి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అనురాగ్ జయంతి 62 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సమర్పించిన అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్ లేకుండా తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 37, గ్రామీణాభివృద్ధికి 7 దరఖాస్తులు అందాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకా రెడ్డి పాల్గొన్నారు.
News March 2, 2026
పోలవరం జిల్లాలో టెన్త్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్

పోలవరం జిల్లాలో 10వ తరగతి ఆపై చదివిన వారికీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉందని ప్రిన్సిపల్ రవికుమార్ సోమవారం తెలిపారు. ఈ కామర్స్ డెలివరీ విభాగం, కస్టమర్ కేర్ విభాగాల్లో పనిచేసేందుకు 3 నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఒక్కొక్క విభాగంలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఈనెల 19లోగా అప్లై చేసుకోవచ్చన్నారు.


