News February 2, 2025
కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

కామారెడ్డిలోని నిజాంసాగర్ రోడ్డులో శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై రాజు వెల్లడించారు.
Similar News
News November 4, 2025
మెదక్: మరి కాసేపట్లో భారీ వర్షం

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందని.. అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.
News November 4, 2025
అనకాపల్లి: రేపు జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈనెల 5న అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన విద్యుత్ సర్కిల్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారన్నారు. 10.45 గంటలకు కే.కోటపాడు మండలం చౌడువాడలోను, మధ్యాహ్నం 2.15 గంటలకు కింతలిలో విద్యుత్ సబ్ స్టేషన్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.
News November 4, 2025
మరికాసేపట్లో భారీ వర్షం

ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాబోయే 2గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చని అంచనా వేశారు. క్లౌడ్ బరస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఇప్పటికే మొంథా తుఫాన్‌తో ప్రజానీకం కుదేలు కాగా క్లౌడ్ బరస్ట్ వార్తల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు.


