News April 7, 2024
కామారెడ్డి:’వడ దెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి’

వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ సూచించారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు అధికంగా నమోదవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితులలో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు తెలిపారు. ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలన్నారు.
Similar News
News February 28, 2026
NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం: కలెక్టర్

విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా పంపిణీ చేపట్టగా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విద్యార్జనను కొనసాగించాలని హితవు పలికారు.
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.