News March 19, 2025
కామారెడ్డి: అంకిత భావంతో పనిచేసి మన్ననలు పొందాలి: జిల్లా కలెక్టర్

అంకిత భావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్‌లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. తన ఛాంబర్‌లో స్టాఫ్ నర్సులు, వాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్‌లుగా కాంట్రాక్టు పద్ధతిన నియామకపు ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు.
Similar News
News December 17, 2025
రూ.లక్ష రుణం పొందడానికి అర్హతలు ఏమిటి?

AP: కౌలు రైతులు రూ.లక్ష వరకు రుణం పొందాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం ఉంటూ, వాటిలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాది లోపు అసలు, వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
News December 17, 2025
95 శాతం పోస్టులు స్థానికులకే!

AP: రాష్ట్రంలో ఇకపై 95% ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు స్థానికులకే దక్కనున్నాయి. మరో 5% ఓపెన్ కోటాలో ఉండనున్నాయి. ఈ మేరకు AP కొత్త పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2025 గెజిట్‌ను కేంద్రం జారీ చేసింది. డైరెక్ట్ నియామకాల్లో స్థానిక, స్థానికేతర కోటాతోపాటు జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులను నిర్దేశించింది. గతంలో 4 జోన్లు ఉండగా తాజాగా 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీజోన్లుగా మార్చింది.
News December 17, 2025
స్థానికత గుర్తింపు ఇలా..

AP: ఉద్యోగ నియామకాల్లో స్థానికతపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. గతంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ ప్రాంతంలో స్థానికులుగా నిర్ణయించేవారు. ఇప్పుడు ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో స్థానికత నిర్ణయించేందుకు నివాస ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మరోవైపు ఉద్యోగుల విభజన విషయంలో ఛాయిస్ ఎంప్లాయీస్‌కే ఇవ్వనున్నారు.


