News April 2, 2024

కామారెడ్డి: అక్కడ మహిళలే నిర్ణేతలు..!

image

జహీరాబాద్ లోక్‌సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నాయి. మొత్తం 16,31,996 ఓట్లు ఉండగా.. ఇందులో పురుషులు 7,98,220, మహిళలు 8,33,718, ట్రాన్స్‌జెండర్లు 58 మంది ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారి పోలింగ్ శాతమే అధికం. కాగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మహిళల ఓటర్లపైనే ఆధారపడి ఉంది.

Similar News

News January 15, 2025

NZB: కేటీఆర్ జైలుకు వెళ్తారు: ఎంపీ అర్వింద్

image

తెలంగాణాలో BRS భూస్థాపితం కాబోతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత KCR ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.

News January 15, 2025

NZB: పసుపు బోర్డుతో అందరికీ లాభం: MP అర్వింద్

image

పసుపు బోర్డుతో కేవలం పసుపు రైతులకే ఉపయోగం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారని, కానీ దాని వల్ల అందరికీ లాభం ఉంటుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చెప్పారు. నిజామాబాద్‌లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని ఆ రైతులకూ లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, బోర్డుతో వారికీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 

News January 15, 2025

తాడ్వాయి: గురుకుల పాఠశాలల్లో దరఖాస్తులకు ఆహ్వానం

image

తాడ్వాయి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెచ్ఎం సురేఖ తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని, ఫిబ్రవరి 23వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలన్నారు.