News March 19, 2024

కామారెడ్డి: ‘అనుమతి లేని ప్రకటనలను గుర్తించాలి’

image

MCMC టీమ్ ఎన్నికల ప్రచారం, చెల్లింపు వార్తలు గుర్తించడం, అనుమతి లేకుండా ప్రకటనలు వేయడం వంటివి గుర్తించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం మీడియా మానిటరింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలకు అనుమతి అదేరోజు అందించే విధంగా MCMC పనిచేయాలన్నారు.

Similar News

News July 5, 2024

NZB: ఉరేసుకుని కండక్టర్ ఆత్మహత్య

image

అనారోగ్యం కారణంగా ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. జిల్లాలోని మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఈరవత్రి శ్రీనివాస్ (36) కండక్టర్‌గా పని చేస్తూ నిజామాబాద్ నాందేవ్ వాడాలో అద్దెకు ఉంటున్నాడు. కిడ్నీ నొప్పి భరించలేక గురువారం రాత్రి రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 5, 2024

కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచారం

image

సదాశివనగర్ మండలంలోని కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గురువారం తెలిపారు. దీంతో ప్రధానంగా రైతులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ పంటలు వేసే సమయంలో ఎలుగుబంటి రావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.

News July 5, 2024

NZB: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇందల్‌వాయి మండలం గౌరారంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాలు.. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తూ జీవించే పరమేశ్వర్ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా 11 కేవీ వైరు తగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ తెలిపారు.