News December 19, 2025

కామారెడ్డి: అప్రమత్తతతో ప్రాణ నష్ట నివారణ

image

అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణ నష్ట నివారణ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సూచించారు. శుక్రవారం ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి వైపరీత్యాల నివారణ నిర్వహణ చర్యలపై జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

Similar News

News December 19, 2025

కర్నూలు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ABCD అవార్డు

image

ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ATM దొంగతనం కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు కర్నూలు జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయి అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ABCD) లభించింది. మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ అవార్డును అందుకున్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను డీజీపీ అభినందించారు.

News December 19, 2025

నేర పరిశోధనలో NTR జిల్లా పోలీసులకు ‘ABCD’ అవార్డు

image

నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన NTR జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. 2025 మొదటి త్రైమాసికంలో పటమట పరిధిలో జరిగిన రూ.3 కోట్ల విలువైన 271 ఐఫోన్ల చోరీ కేసును రికార్డు సమయంలో ఛేదించినందుకు గాను వీరికి ‘ఏబీసీడీ’ (ABCD) అవార్డు దక్కింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా నగర పోలీస్ కమిషనర్ ఈ అవార్డును అందుకున్నారు.

News December 19, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒MBNR:T-20 క్రికెట్ లీగ్.. షెడ్యూల్ విడుదల
✒సౌత్ జోన్.. 22న ‘ఫుట్ బాల్’ ఎంపికలు
✒MBNR: పాత బకాయిలు ఇస్తేనే సర్వే చేస్తాం: ఆశా వర్కర్లు
✒NGKL: వ్యవసాయ పొలాల్లో పెద్దపులి జాడలు
✒సౌత్ జోన్..రేపు షటిల్,బ్యాడ్మింటన్ ఎంపికలు
✒జాతీయస్థాయి ఖో-ఖో టోర్నికి పాలమూరు విద్యార్థిని
✒MBNR:ఈనెల 21న..U-19 కరాటే ఎంపికలు
✒ఓపెన్ SSC,INTER దరఖాస్తుకు గడువు పెంపు