News January 29, 2025

కామారెడ్డి: అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం

image

అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని కామారెడ్డి జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి ప్రమీల తెలిపారు. జిల్లాలోని వికలాంగులు 18 నుంచి 50 సంవత్సరాల వయసు లోపు వారికి తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల ఆర్థిక సాయం 100% సబ్సిడీ బ్యాంక్ లింక్ లేకుండా అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. అర్హత గల వారు కామారెడ్డి వికలాంగుల సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News November 11, 2025

₹12.92 ట్రిలియన్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం

image

కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే 7% పెరిగి ₹12.92 ట్రిలియన్లకు చేరింది. APR 1-NOV 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి ₹12.08 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్‌లు గత ఏడాది కన్నా 18% తగ్గి ₹2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. FY 2025-26కి ₹25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం.

News November 11, 2025

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కలెక్టర్ VC

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్ష చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై జిల్లాలోని జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్, పీడీ హౌసింగ్‌తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

News November 11, 2025

లేటెస్ట్ అప్‌డేట్స్

image

⋆ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన NIA.. సిరాజ్ ఉర్ రెహమాన్(VZM), సయ్యద్ సమీర్(HYD) యువతను టెర్రరిజంవైపు ప్రేరేపించేలా కుట్ర పన్నారని అభియోగాలు
⋆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌పై వెనక్కి తగ్గిన YS జగన్.. NOV 21లోగా CBI కోర్టులో హాజరవుతానని స్పష్టీకరణ.. యూరప్ వెళితే NOV 14లోగా కోర్టులో హాజరుకావాలని గతంలో ఆదేశించిన కోర్టు
* జూబ్లీహిల్స్‌లో 50.16% ఓటింగ్ నమోదు