News September 10, 2024

కామారెడ్డి: అష్టావధాని ఆయాచితం నటేశ్వరశర్మ కన్నుమూత

image

ప్రఖ్యాత కవి,అష్టావధాని డాక్టర్ ఆయాచితం నటేశ్వరశర్మ మంగళవారం అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. రామారెడ్డి మండలానికి చెందిన నటేశ్వర శర్మ సంస్కృతంలో 50కి పైగా రచనలు రాశారు. డాక్టర్ నటేశ్వర శర్మ రచనలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2023లో దాశరథి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ నటేశ్వర శర్మ కన్నుమూయడంతో కవులు, కళాకారులు శోక సముద్రంలో మునిగారు.

Similar News

News October 6, 2024

నిజామాబాద్‌కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తోంది: మహేశ్ కుమార్

image

నిజామాబాద్‌కు కూడా హైడ్రా తరహా వ్యవస్థ వస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన NZBలో మీడియాతో చర్చాగోష్టిలో మాట్లాడుతూ.. హైడ్రా తరహా నిడ్రా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో హైడ్రా చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. వయనాడ్‌గా హైదరాబాద్ పరిస్థితి మారకూడదంటే మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు.

News October 5, 2024

NZB: హరీశ్ రావు మాట తప్పారు: మహేష్ కుమార్ గౌడ్

image

రుణ మాఫీ విషయంలో బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు రాజీనామా చేస్తానని చెప్పి మాట తప్పారని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో జరిగిన రుణమాఫీ, కాంగ్రెస్ తొమ్మిది నెలలు జరిగిన రుణమాఫీపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కొండా సురేఖ వివాదంపై మాట్లాడుతూ.. అది ముగిసిన వివాదం అన్నారు.

News October 5, 2024

NZB: GREAT.. ఒకేసారి ఐదు ఉద్యోగాలు

image

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి చెందిన మంచిప్ప గ్రామ యువతి తూర్పు అర్చన ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించింది. ఏఈ, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, టీపీడీఓ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తూర్పు అర్చన మాట్లాడుతూ.. తాను సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని తన భర్త రాకేష్ సాకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని తెలిపారు.