News March 11, 2025
కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుకు రూ.50,918 రాయితీ

వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా.. NMEO-OP పథకం కింద ఆయిల్ ఫాం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కామారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి అన్నారు. ఆయిల్ ఫాం సాగు ప్రోత్సహించడానికి ఎకరానికి రూ.50,918 వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు.
Similar News
News March 11, 2025
నిర్మల్ జిల్లాలో పలువురు CIల బదిలీలు

నిర్మల్ జిల్లాలో పలువురు CIలను రాష్ట్ర పోలీసు అధికారులు బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేశారు. డీసీఆర్‌బీలో CIగా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్‌ను డీఎస్‌బీకి బదిలీ చేశారు. సీసీఎస్ విభాగంలో CIగా విధులు నిర్వహిస్తున్న కృష్ణను నిర్మల్ రూరల్ CIగా, హైదరాబాద్‌లో వెయిటింగ్ లిస్టులో ఉన్న సమ్మయ్యను డీసీఆర్‌బీ నిర్మల్‌కు బదిలీ చేశారు.
News March 11, 2025
రాజన్న సిరిసిల్ల: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. సిరిసిల్లలో గాలినాణ్యత విలువ 104గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
News March 11, 2025
విజయనగరం జిల్లాలో మైనార్టీలకు గుడ్ న్యూస్

ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, జైనులు, పార్శీకుల రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఎస్.జాన్ సోమవారం కోరారు. వివిధ బ్యాంకుల నుంచి సబ్సిడీతో కూడిన రుణాలను అందించనున్నట్లు తెలిపారు. వయసు 21- 55 లోపు ఉండాలన్నారు. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.