News February 17, 2025

కామారెడ్డి: ఆర్టీసీ ఏసీ బస్సులో 10% రాయితీ

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బెంగళూరు వరకు వెళ్లే ఆర్టీసీ ఏసీ బస్సులో 10 శాతం రాయితీ కల్పించినట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె చెప్పారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ ప్రత్యేక రాయితీలు కల్పిస్తుందని వివరించారు. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులకు అనుకూలమైన వసతులు కల్పించినట్లు తెలిపారు.

Similar News

News January 10, 2026

ఒర్ణబ్ తుఫాన్ హెచ్చరిక

image

ఈ నెల 10 నుంచి ఒర్ణబ్ తుఫాన్ ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. మార్కెట్ యార్డుకు సరుకులు తీసుకొచ్చే రైతులు పంట ఉత్పత్తులు తడవకుండా టార్పాలిన్లు కప్పుకుని రావాలని సూచించారు. యార్డులోకి వచ్చిన సరుకును షెడ్లలో లేదా షాపుల ముందు భాగంలో భద్రంగా ఉంచుకోవాలన్నారు.

News January 10, 2026

ధనుర్మాసం: ఇరవై ఆరో రోజు కీర్తన

image

‘ఓ వటపత్రశాయీ! వ్రతం కోసం నీ చెంతకు వచ్చాము. మా పూర్వీకులు నడిచిన బాటలో ఈ వ్రతానికి కావాల్సిన పరికరాలను ప్రసాదించమని వేడుకుంటున్నాము. నీ పాంచజన్యం వంటి తెల్లని శంఖాలు, వాద్యాలు, మంగళ గానాలు పాడే భక్తుల సమూహం మాకు కావాలి. వెలుగునిచ్చే మంగళ దీపాలు, వ్రత ధ్వజాలు అనుగ్రహించు. లోకాన్నంతా నీ కుక్షిలో ఉంచుకోగల నీకు ఇవి ఇవ్వడం కష్టమేం కాదు. కరుణించి మా వ్రతం విజయవంతమయ్యేలా దీవించు స్వామీ!’ <<-se>>#DHANURMASAM<<>>

News January 10, 2026

ఫిబ్రవరి 14న మున్సిపల్ ఎన్నికలు!

image

TG: రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్‌ కార్పొరేషన్ల పాలక మండళ్ల ఎన్నికలను ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 17న ప్రకటించొచ్చని తెలుస్తోంది. BCలకు 32% రిజర్వేషన్లు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 2,996 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం రూ.85 కోట్లు విడుదల చేయాలని పురపాలక శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది.