News October 31, 2025
కామారెడ్డి: ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నవంబర్ 1 నుంచి 14వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని చెప్పారు. ఈ గడువు తర్వాత చెల్లించేవారు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవలసి ఉంటుందని ఆయన సూచించారు.
Similar News
News October 31, 2025
కండలేరుకు నిధులు ఇవ్వాలని వినతి

కండలేరులో 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించి 30 ఏళ్లు అవుతోంది. దీన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ తెలిపారు. డ్యాం సాధారణ మెయింటెనెన్స్‌కు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు ఆయన వినతిపత్రం అంందజేశారు.
News October 31, 2025
బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా నుంచి రక్షించాలి: కవిత

చారిత్రాత్మక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం బొమ్మలమ్మగుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్నుపడిందన్నారు. సొంత ఖజానా నింపుకోవడానికి గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం గుట్టను రక్షించుకోవాలన్నారు.
News October 31, 2025
UPSC పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: విశాఖ JC

నవంబర్ 2న నిర్వహించనున్న UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3268 మంది హాజరుకానునట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని JC ఆదేశించారు.


