News April 24, 2025

కామారెడ్డి: ఇంటర్ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్

image

కామారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీ వారు నిర్వహిస్తున్న టెక్‌-బీ ప్రోగ్రాం కింద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ పూర్తి చేసుకున్న ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బైపీసీ, ఒకేషనల్ కంప్యూటర్స్ చదివిన విద్యార్థులకు ఈనెల 24న ఉదయం 9 గంటలకు ఆర్కే డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి రాజేశ్ తెలిపారు.

Similar News

News April 24, 2025

నల్గొండ జిల్లాలో సుర్రుమంటున్న ‘సూరన్న’

image

నల్గొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయి అనే నాణుడిని నిజం చేస్తూ రోహిణీకి ముందే సూరన్న సుర్రుమంటున్నాడు. బుధవారం కట్టంగూర్‌లో ఏకంగా రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మాడ్గులపల్లి 45.2, నిమనూరు 44.9, త్రిపురారం 44.8, నార్కట్‌పల్లి 44.6, అనుముల 44.6, వేములపల్లి 44.6, దామరిచర్ల 44.4, తిప్పర్తిలో కనిష్ఠంగా 44.1 డిగ్రీలు నమోదయ్యాయి.

News April 24, 2025

రాజమండ్రి: హత్యచేసిన వారిపై చర్యలు కోరుతూ ఆందోళన

image

వివాహితను ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేసిన నిందితుడిని ఉరితీయాలంటూ బాధిత మహిళ కుటుంబంతో కలిసి, ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. బుధవారం రాత్రి రాజమండ్రి బైపాస్ రోడ్ చర్చి సెంటర్లో ఎమ్మార్పీఎస్ ఈ ఆందోళన చేపట్టారు. ఆంధ్రనగర్‌ 1వ వీధిలో నివసిస్తున్న పలివెల మార్త (23)ని ప్రేమపేరుతో ఒక వ్యక్తి మోసగించి చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసి 20 రోజులైనా న్యాయం జరగలేదన్నారు.

News April 24, 2025

రాంబిల్లి: తండ్రిని హత్య చేయించిన కొడుకు

image

రాంబిల్లి మండలం చినకలువలాపల్లిలో ఈ నెల 21న వడ్డీ వ్యాపారి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జల్లి తాతారావును కొడుకు అప్పల రెడ్డే హత్య చేయించాడని సీఐ నరసింగరావు బుధవారం తెలిపారు. తండ్రి తన ఆస్తిని సవతి తల్లి కుమార్తెకు ఇచ్చేస్తాడని అనుమానించి ఇద్దరు వ్యక్తులను పురమాయించి హత్య చేయించినట్లు తెలిపారు. అప్పల రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

error: Content is protected !!