News May 6, 2024

కామారెడ్డి: ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు కామారెడ్డి ద్వితియ శ్రేణి మెజిస్ట్రేట్ ప్రతాప్ తీర్పునిచ్చారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మహమ్మద్ యూనిస్, కోన గణేశ్ పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచనట్లు పోలీసులు తెలిపారు. వారికి న్యాయస్థానం 2రోజుల జైలు శిక్షతో పాటు రూ.200 చొప్పున జరిమానా విధించింది.

Similar News

News January 17, 2025

లింగంపేట: బీడు భూములకు రైతుభరోసా రాకుండా చూడాలి: RDO

image

రైతు భరోసా సర్వేను ఎలాంటి తప్పులు జరగకుండా నిర్వహించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో గురువారం రైతు భరోసా సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన రైతులకు రైతు భరోసా వచ్చేవిధంగా చూడాలని AEOలకు, రెవెన్యూ అధికారులను సూచించారు. బీడు భూములకు రైతు భరోసా రాకుండా చూడాలన్నారు.

News January 16, 2025

నిజామాబాద్: మెగా రక్తదాన శిబిరంలో కలెక్టర్ ఆశిష్

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం లింగంపేట్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై సమావేశం నిర్వహించారు. తొలుత మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై సమాజంలో ప్రతిఒక్కరికీ అవగాహన కలిగి ఉండేలా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

News January 16, 2025

NZB: ఓ బిడ్డా.. నిజామాబాద్ మరో 30 ఏళ్లు నీ అడ్డా..!

image

రైతుల దశాబ్దాల కల నెరవేర్చిన MP అర్వింద్‌కు అభినందనలు వెలువెత్తుతున్నాయి. ‘రాజకీయంలో ఎంతో మంది నాయకులను చూశాను కానీ అర్వింద్ లాంటి మొండి పట్టు ఉన్న నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాను. పసుపు బోర్డు సాధించిన అర్వింద్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఓ బిడ్డా.. నిజామాబాద్ మరో 30 ఏళ్ల నీ అడ్డా..! 68 ఏళ్ల పసుపు రైతు ధన్యవాదములు తెలుపుతున్నట్లు నగరంలో రైతు ఏర్పాటు చేసిన వెలిసిన ఫ్లెక్సీ వైరల్‌గా మారింది.