News April 23, 2025

కామారెడ్డి ఇన్‌ఛార్జి డీఈవోగా అశోక్

image

కామరెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారిగా నిజామాబాద్ డీఈఓ అశోక్ బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి ఇన్‌ఛార్జి డీఈఓ అశోక్‌ను ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కామారెడ్డి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సెక్రటరీ బలరాం, లచ్చయ్య, పంపరి ప్రవీణ్ కుమార్, ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2026

పార్వతీపురం: ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం సుఖ ప్రసవాలు జరగాలి’

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శతశాతం సుఖ ప్రసవాలు జరగాలని కలెక్టర్ ప్రభాకర రెడ్డి వైద్యులకు స్పష్టం చేశారు. గురువారం పార్వతీపురం జిల్లాలోని ఆసుపత్రుల పనితీరుపై సమావేశం ఏర్పాటు చేశారు. సుఖ ప్రసవాలు జరిగేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, సిజేరియన్‌ కేసులకు గల సైంటిఫిక్ కారణాలను తెలుసుకొని, వాటిని నివారించే దిశగా కృషిచేయాలని వైద్యులను కోరారు.

News February 19, 2026

జంగంపల్లి చెరువులో పడి వ్యక్తి మృతి

image

బిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన మహమ్మద్ నవాజ్ (40) చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబీకులు, గ్రామస్థులు తెలిపారు. గురువారం ఉదయం చెరువులో మృతదేహం తేలడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News February 19, 2026

విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్

image

విశాఖలో జరుగుతున్న ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం విశాఖ వచ్చారు. ఆయనకు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పలువురు నేవీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. విశాఖలో ఐఎఫ్ఆర్ వేడుకల్లో పాల్గొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.