News October 22, 2025
కామారెడ్డి: ఇళ్ల నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో ఇంటి నిర్మాణ దశలను పరిశీలించి, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లేదా పరిపాలనా ఇబ్బందులు వెంటనే తెలపాలని, నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News October 23, 2025
ఖమ్మం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో సీట్ల భర్తీ

జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో డ్రాపౌట్‌ల ద్వారా ఏర్పడిన 40 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత తెలిపారు. 3, 4, 6, 7, 8, 9వ తరగతుల్లో రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవంబరు 2వ తేదీలోపు కలెక్టరేట్‌లోని ఎస్-27 విభాగంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
News October 23, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 23, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.12 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.02 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 23, 2025
VZM: జిల్లాకు బాక్సింగ్‌లో 4 రాష్ట్ర స్థాయి మెడల్స్

రాజమండ్రిలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో విజయనగరం జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-17 కేటగిరీలో దుర్గాప్రసాద్, సచిన్.. అండర్-19 కేటగిరీలో వర్ధన్ రెడ్డి, యశ్వంత్ బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని బుధవారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని కలెక్టర్ సూచించారు.