News October 24, 2025

కామారెడ్డి: ఈనెల 31 నుంచి పరీక్షలు

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ(అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ) రెగ్యులర్ 7, 9 సెమిస్టర్ పరీక్షలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 6 వరకు జరగనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల షెడ్యూల్ విడుదల చేసామని, పూర్తి వివరాలకు వెబ్‌సైట్ సందర్శించాలని ఆయన తెలిపారు.

Similar News

News October 24, 2025

అమరావతిలో RBI ప్రధాన కార్యాలయ నిర్మాణానికై పూర్తైన ఒప్పందం

image

అమరావతిలోని నేలపాడులో 3 ఎకరాలలో 1.6 లక్షల చదరపు అడుగులలో RBI ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ముందడుగు పడింది. రూ.12 కోట్లు చెల్లించిన RBI..భూ కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసింది. సంబంధిత పత్రాలను CRDA ల్యాండ్స్ విభాగ అధికారి వి.డేవిడ్ రాజు..RBI అధికారి వీసీ రూపకు శుక్రవారం అందజేశారు. ప్రాంతీయ కార్యాలయ నిర్మాణంతో పాటు అమరావతిలో RBI రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు CRDA తెలిపింది.

News October 24, 2025

MDK: ఈ సర్వేలో మీ అభిప్రాయాలు తెలపండి..!

image

తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాల అభివృద్ధి ప్రణాళిక కోసం ప్రజల అభిప్రాయాలు, ఆశయాలను సేకరించేందుకు ప్రభుత్వం సర్వేను ప్రారంభించింది. రైతులు, ఇతర పౌరులు మీ అమూల్యమైన అభిప్రాయాలను ఈ సర్వే ఫారం ద్వారా తెలియజేసి తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడాలని అధికారులు పేర్కొన్నారు. ఈ లింక్ https://www.telangana.gov.in/telanganarising/ ఓపెన్ చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి అభిప్రాయాలను తెలపాలని పేర్కొన్నారు.

News October 24, 2025

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

image

రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే ఉన్నతాధికారులతో శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. నర్సాపురం-కోటిపల్లి, నర్సాపురం-మచిలీపట్నం పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ చేయాలన్నారు. నరసాపురం-వారణాసి కొత్త రైలుకు కీలక ప్రతిపాదన, వందే భారత్‌కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలన్నారు.