News September 6, 2025

కామారెడ్డి: ఈ నెల 12లోగా నివేదిక అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో కురిసిన అధిక వర్షాల వల్ల జరిగిన నష్టానికి గల కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈనెల 12వ తేదీలోగా నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్, సబ్ కలెక్టర్, RDO, ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, అగ్రికల్చర్, హౌసింగ్, RWS, విద్యుత్, మున్సిపల్ ఇతర శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

Similar News

News September 8, 2025

భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త

image

చిలమత్తూరులో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. మద్యం మత్తులో భార్య లక్ష్మిదేవి(35)తో వాగ్వాదానికి దిగిన రాఘవేంద్ర కోపోద్రిక్తుడై గొడ్డలితో నరికి హతమార్చాడు. రక్తమోడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దంపతులకు ఇంటర్ చదువుతున్న ఒక కుమార్తె ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

News September 8, 2025

బిగ్‌బాస్ సీజన్-9 కంటెస్టెంట్లు వీరే..

image

బిగ్‌బాస్ సీజన్-9లో మొత్తం 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సెలబ్రిటీ కోటాలో తనూజ(ముద్ద మందారం), నటి ఆశా సైనీ, కమెడియన్లు సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రఫర్ శ్రష్ఠి వర్మ, సీరియల్ నటుడు భరణి శంకర్, రీతూ చౌదరీ, నటి సంజనా గల్రానీ, ఫోక్ డాన్సర్ రాము రాథోడ్, సామాన్యుల నుంచి సోల్జర్ పవన్, మాస్క్ మ్యాన్ హరీశ్, డిమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీశ్‌ లోనికి వెళ్లారు.

News September 8, 2025

విశాఖ: ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో అగ్నిమాపక డీజీ సమీక్ష

image

అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ వెంకటరమణ ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖలోని IIM క్యాంపస్‌లో జరిగిన సమావేశంలో NOC జారీ ప్రక్రియ సులభతరమైందని, కార్యాలయాలకు రాకుండా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పొందుతున్నారన్నారు. ఈ జోన్‌లో మరో ఆరు అగ్నిమాపక కేంద్రాలను రూ.2.25 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మరో రూ.13.9 కోట్లతో శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తామన్నారు.