News January 27, 2025

కామారెడ్డి: ఉత్తమ లెక్చరర్‌గా వనజ

image

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ లెక్చరర్‌గా వనజ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కళాశాలలో వివిధ బాధ్యతల్లో విధులు సక్రమంగా నిర్వహించినందుకు గాను ఆమె అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగంలో వనజ పని చేస్తున్నారు. అవార్డు రావడంతో కళాశాల అధ్యాపకులు అభినందించారు.

Similar News

News November 13, 2025

32 కార్లతో సీరియల్ అటాక్స్‌కు కుట్ర?

image

ఢిల్లీ బ్లాస్ట్‌ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాల తరలింపునకు, బాంబుల డెలివరీకి 32 కార్లను టెర్రరిస్టులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) సీరియల్ అటాక్స్‌కు కుట్ర చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 6 లొకేషన్లు సహా దేశంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 కార్లను అధికారులు గుర్తించారని సమాచారం.

News November 13, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 3

image

13. భూమి కంటె భారమైనది? (జ.జనని)
14. ఆకాశం కంటె పొడవైనది? (జ.తండ్రి)
15. గాలి కంటె వేగమైనది? (జ.మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? (జ.ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో.. తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండనివారికి సజ్జనత్వం వస్తుంది.)
17. తృణం కంటె దట్టమైనది ఏది? (జ.చింత)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 13, 2025

విజయవాడలో దారుణ హత్య

image

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. విజయ టాకీస్ సమీపంలోని విన్స్ హాస్పిటల్లో పనిచేసే మహిళను ఆమె భర్త గురువారం మధ్యాహ్నం గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ ఆలీ తెలిపారు.