News August 27, 2025
కామారెడ్డి: ‘ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం’

ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం సమష్టిగా పోరాడాలని ఎంప్లాయీస్ JAC కామారెడ్డి జిల్లా ఛైర్మన్, TNGO జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో TGEJAC విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. న్యాయమైన హక్కులు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.
Similar News
News August 27, 2025
భద్రాచలంలో ఘనంగా సీతారామచంద్రస్వామి నిత్యకళ్యాణం

భద్రాచలంసీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం నిత్యకళ్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేదమంత్రాల మధ్య అర్చకులు స్వామి, అమ్మవార్ల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
News August 27, 2025
నిడిగొండలో చారిత్రక కాంతులు..!

జిల్లాలోని రఘునాథపల్లి మండలం నిడిగొండ చారిత్రక, ఆధ్యాత్మిక చిహ్నాల సంపన్న గ్రామం. అనేక శిల్పాలు, శాసనాలు ఘనమైన వారసత్వ సంపద కలిగిన గ్రామం. ఈ గ్రామంలో నేటి వరకు 10 గణపతి మూర్తులను మనం దర్శించవచ్చు. మరికొన్ని దొరికే అవకాశాలు ఉన్నాయి. ఈ శిల్పాలు చక్కని రూప లావణ్యంతో, శిల్ప కళా విశేషాలతో కూడియున్నవి. ఇందులో రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ, కాకతీయ అనంతర కాలంలోనివి. మన వారసత్వానికి ప్రతీకలు.
News August 27, 2025
JGTL: కరాటే పోటీల్లో మైనారిటీ కళాశాల విద్యార్థికి ‘GOLD’

జగిత్యాలలోని తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల(టీజీఎంఆర్జేసీ) విద్యార్థి ఎం.డీ.అయానుద్దిన్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్- 2025లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ పోటీల్లో ఫైనల్స్‌లో ఆయన ఇరాక్ ఆటగాడిని ఓడించి అంతర్జాతీయ వేదికపై మన దేశఖ్యాతిని చాటాడు. స్వదేశానికి పేరుప్రఖ్యాతులు తెచ్చిన అయానుద్దిన్‌ను కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.