News February 28, 2026
కామారెడ్డి: ఉపాధి కూలీలతో కలిసి కాంగ్రెస్ నేతల పని

కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగఠన్ సృజన్ అభియాన్ 8వ రోజు కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా మదనపల్లిలో శనివారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. మన్రేగా (ఉపాధి హామీ) పథక పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు ఆత్రం సుగుణ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో కూలీలతో కలిసి పని చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 2, 2026
వర్క్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయండి: విష్ణుకుమార్ రాజు

GVMC ఇంజనీరింగ్ విభాగంలో 15 ఏళ్లకు పైగా ఒకే వార్డులో పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను తక్షణమే బదిలీ చేయాలని మేయర్, కమిషనర్‌ను MLA విష్ణుకుమార్ రాజు కోరారు. 5-15 ఏళ్ల వరకు బదిలీ లేకుండా కొనసాగుతున్న వారిలో కొందరు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో అభివృద్ధి పనుల్లో అవినీతి చోటుచేసుకుంటోందని అన్నారు. పారదర్శకత కోసం వెంటనే బదిలీలు చేపట్టాలని కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు.
News March 2, 2026
పాలమూరు: మోడల్ స్పోర్ట్స్ అకాడమీ ప్రవేశాల దరఖాస్తుల ఆహ్వానం

వచ్చే విద్యా సంవత్సరానికి గాను గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మోడల్ స్పోర్ట్స్/వాటర్ స్పోర్ట్స్ అకాడమీల 5వ తరగతి ప్రవేశాలకు గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.జనార్దన్ తెలిపారు. 31-08-2026 నాటికి 9-11 ఏళ్లు వయస్సు ఉండి, ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న వారు అర్హులు. ఈనెల 12 దరఖాస్తు చివరి తేదీ, 13న MBNR జిల్లా క్రీడా ప్రాంగణంలో ఎంపికలు నిర్వహించబడతాయి.
News March 2, 2026
రేపు తిరుమల ఆలయం మూసివేత

చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలోని అన్ని ఆలయాలు మూసివేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు TTDకి చెందిన కపిలతీర్థం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాలను మంగళవారం ఉదయం 9గంటలకు క్లోజ్ చేస్తారు. రాత్రి 7.30కి తెరిచి శుద్ధి చేస్తారు. శ్రీకాళహస్తి ఆలయం ఒక్కటే తెరిచి ఉంచుతారు. ఇప్పటికే తిరుమల దర్శనానికి సంబంధించిన టోకన్ల జారీ నిలిపివేశారు.


