News February 28, 2026
కామారెడ్డి: ఉపాధి హామీ పనులపై కలెక్టర్ సమీక్ష

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జాతీయ ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పనులు కల్పించాలన్నారు. ఉపాధి హామీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు వివరించారు. ఉపాధి హామీ పనుల వద్ద వేసవిని, దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
Similar News
News March 1, 2026
2029లో జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని

AP: కూటమి ప్రభుత్వం బెదిరింపులకు YCP భయపడదని ఆ పార్టీ నేత కొడాలి నాని అన్నారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాట్లాడారు. ‘అంబటి ఎప్పుడూ ఎవరినీ దూషించలేదు. TDP నేతలు కావాలనే ఆయన్ను రెచ్చగొట్టారు. రాంబాబు క్షమాపణలు చెప్పినా ఆయన ఇంటిపై దాడి చేశారు. లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి YCP భయపడదు. 2029లో జగన్ సీఎం కావడం తథ్యం. రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేశ్‌కే ఇబ్బంది’ అని హెచ్చరించారు.
News March 1, 2026
సంజూ హాఫ్ సెంచరీ

T20WC: కీలక మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్(56*) అద్భుతంగా ఆడుతున్నారు. విండీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అభిషేక్(10), ఇషాన్(10) తక్కువ పరుగులకే ఔటైనా వరుసగా బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కెప్టెన్ సూర్య 18 పరుగులు చేసి ఔటైన నేపథ్యంలో తిలక్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేస్తే ఇండియా విజయం సాధించడం ఖాయమవుతుంది.
News March 1, 2026
GDK: స్టేషన్‌లో పార్కింగ్ ఏంటని బైక్‌పై ప్రతాపం చూపించిన పోలీస్ అధికారి

RMG పోలీస్ కమిషనరేట్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుకు సంబంధించిన బైక్‌ను ఓ పోలీస్ అధికారి శనివారం ధ్వంసంచేశారు. అ ఠాణాలో రోజు పార్కింగ్ చేసి PDPLకి నిత్యం విధులు నిర్వహించేందుకు హోంగార్డు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ పార్కింగ్ ఏంటని కోపగించుకున్న సదరు పోలీస్ అధికారి ఏకంగా బైక్‌పై తన ప్రతాపాన్ని చూపించారు. ఇష్టానుసారంగా పగలగొట్టి కసి తీర్చుకున్నారు. దీనిపై పోలీసు అధికారులకు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది.


