News March 21, 2024
కామారెడ్డి: ఎన్నికల కోడ్.. రూ.1.20 లక్షలు పట్టివేత..

నిజాంసాగర్ మండలం బ్రాహ్మణ పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.లక్ష 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో HYD నుంచి జాల్నాకు వెళ్తున్న ఓ కారులో ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు SI సుధాకర్ పేర్కొన్నారు.
Similar News
News April 16, 2025
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రిలోని రేకుల షెడ్డు వద్ద ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడంతో కానిస్టేబుల్ చికిత్స నిమిత్తం తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. వివరాలు తెలిసిన వారు 8712659714 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
News April 16, 2025
NZB: ‘అసత్య ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు’

రేషన్ షాపుల్లో పంపిణీ చేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయంటూ సామాజికమాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అవాస్తవమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆందోళనకు గురి చేసి సమాజంలో అశాంతి సృష్టించాలనే దురుద్ధేశంతో కొందరు సామాజికమాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
News April 16, 2025
NZB: శని పుత్రుడు పోచారం: జీవన్ రెడ్డి

బాన్సువాడ MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడని BRS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆరోపించారు. బాన్సువాడలో మంగళవారం జరిగిన BRS రజతోత్సవ సభ సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాసరెడ్డిని CM కేసీఆర్ లక్ష్మీ పుత్రుడు అని ప్రేమగా పిలిచేవారన్నారు. అయితే ఆయన లక్ష్మీ పుత్రుడు కాదని, శని పుత్రుడు అని ఎద్దేవా చేశారు.