News February 5, 2026

కామారెడ్డి: ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్

image

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్‌ను ఎన్నికల పరిశీలకుల అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ సూపర్‌వైజర్లను ఎంపిక చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, మధుమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Similar News

News February 7, 2026

ఇంట్లో నుంచే LPG కనెక్షన్‌కి ఆధార్ లింక్..!

image

LPG & ఉజ్వల గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ e-KYCని పూర్తి చేయాలని కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే 75% మంది ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపింది. మిగిలినవారు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫ్రీగా KYC చేసుకోవచ్చు. ఈ <>వెబ్‌సైట్‌లో<<>> ఏజెన్సీ, KYC యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 18002333555కు కాల్ చేయండి.

News February 7, 2026

బ్యాలెట్ బాక్సులకు పటిష్ట భద్రత: ఎస్పీ జానకి

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల నిల్వ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ యార్డు వద్ద వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమీక్షించారు.

News February 7, 2026

అప్పికట్లలో ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ను తనిఖీ చేసిన కలెక్టర్

image

ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరవేయడం, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చేపట్టిన ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ శనివారం తనిఖీ చేశారు. బాపట్ల మండలం అప్పికట్లలో పర్యటించిన ఆయన.. సర్వే నమోదు ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించారు. వివరాల నమోదులో ఖచ్చితత్వం పాటించాలని, ప్రజలకు సేవలందించడంలో జాప్యం చేయకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.