News April 12, 2024

కామారెడ్డి: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో మంటలు

image

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మాయాబజార్‌ ప్రాంతంలో ఎలక్ట్రిక్‌ స్కూటీపై ఓ వ్యక్తి వెళ్తుండగా అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్కూటీని నిలిపివేశారు. అనంతరం ఒక్కసారిగా స్కూటీలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

Similar News

News April 8, 2026

NZB: ఆకతాయిలు.. అమ్మాయి వెంటపడితే అంతే

image

మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిఘా ముమ్మరం చేశాయి. ముఖ్యంగా NZB నగరంలోని ఖిల్లా ప్రభుత్వ కళాశాల, గిరిరాజ్ కాలేజీ వంటి విద్యాసంస్థలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక దృష్టి సారించారు. 3 నెలల్లో 150కి పైగా ఈవ్ టీజింగ్ కేసులు నమోదు కాగా, పట్టుబడ్డ వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వేధింపులు ఎదురైతే వెంటనే 100 లేదా షీ టీమ్ ను సంప్రదించాలన్నారు.

News April 8, 2026

నిజామాబాద్: తైబజార్ వేలంలో కాసుల వర్షం

image

నిజామాబాద్ జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన తైబజార్ వేలం పాటలు ఈ ఏడాది భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. నవీపేట్, బోధన్, రుద్రూర్ వంటి ప్రాంతాల్లో భారీగా రూ.లక్షల్లో ధరలు పలికాయి. పెరిగిన పోటీతో స్థానిక సంస్థల ఖజానాకు భారీగా నిధులు సమకూరడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులను పట్టణ, గ్రామ అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు.

News April 7, 2026

NZB: ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఈవీఎం గోడౌన్‌ను నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం సందర్శించారు. సీళ్ల స్థితి, పోలీసు బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించిచారు.అన్ని విధానాలు కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్, విజయేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు