News January 1, 2025
కామారెడ్డి: ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డి
కామారెడ్డి ఏఎస్పీగా చైతన్య రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం ఆమెను కామారెడ్డి ఏఎస్పీగా నియమించింది. ఈ మేరకు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు.
Similar News
News January 4, 2025
KMR: అదనపు కట్నం కోసం హత్య.. భర్తకు జీవిత ఖైదు
అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త రమావత్ రమేశ్‌కు జీవిత ఖైదు విధిస్తూ శుక్రవారం కామారెడ్డి ప్రధాన న్యాయమూర్తి వర ప్రసాద్ తీర్పునిచ్చారు. జిల్లాలోని సురాయిపల్లి తండాకు చెందిన రమేశ్ భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ 2021 ఫిబ్రవరి 27న లింగంపేట్ బస్టాండ్‌లో కొట్టాడు. గాయపడినా ఆమె నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. నేరం రుజువుకావడంతో జీవిత ఖైదు విధించారు.
News January 4, 2025
నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన: MLC కవిత
తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లోని ఆమె నివాసంలో శుక్రవారం జాగృతి విద్యార్థి నాయకుడు మునుకుంట్ల నవీన్ రూపొందించిన నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ కుమార్, భగవత్ యాదవ్, సునీల్ జోషి, రాజ్ కుమార్ యాదవ్, ఈశ్వర్ అజయ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
News January 4, 2025
పోలీస్ వ్యవస్థలో పని చేసేవారందరూ పబ్లిక్ సర్వెంట్లే: ఇన్‌ఛార్జి సీపీ
పోలీస్ వ్యవస్థలో పని చేసేవారందరూ పబ్లిక్ సర్వెంట్లే అని నిజామాబాద్ ఇన్‌ఛార్జి సీపీ సింధూ శర్మ అన్నారు. శుక్రవారం డిచ్పల్లి 7వ పోలీస్ బెటాలియన్‌లో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆమె మాట్లాడారు. ఎట్టి పరిస్థితులలోనూ ప్రజల మనోభావాలకు భంగపర్చకుండా ప్రజల మన్ననలను పొందాలని ఆమె ట్రైనింగ్ పొందిన కానిస్టేబుళ్లకు సూచించారు.