News October 15, 2025

కామారెడ్డి: ‘ఏకాభిప్రాయంతో DCC అధ్యక్షుడి నియామకం’

image

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. AICC అబ్జర్వర్ రాజ్ పాల్ కరోలా హాజరయ్యారు. ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తూ డీసీసీ అధ్యక్షులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. సీనియారిటీ, పార్టీ పట్ల నిబద్ధత తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు. ఏకాభిప్రాయంతో DCC అధ్యక్షుడి నియామకం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాల్గొన్నారు.

Similar News

News October 15, 2025

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి: NZB కలెక్టర్

image

భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పాలన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపి మాట్లాడారు. అర్జీలను త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత అధికారులదేనన్నారు. గ్రామ స్థాయిలో జీపీఓలు కీలక బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.

News October 15, 2025

‘జాతీయ రహదారి 167(ఏ) నిర్మాణం పూర్తి చేయాలి’

image

వాడరేవు-చిలకలూరిపేట జాతీయ రహదారి 167 (ఏ) నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం చెప్పారు. 47 కిలో మీటర్ల పొడవునా నిర్మించే రహదారి బాపట్ల జిల్లాలోనే 35 కిలోమీటర్ల పొడవున వెళ్తుందన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు, తదితరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇప్పటివరకు 92.38% రహదారి నిర్మాణం పూర్తి చేసినట్లు వివరించారు.

News October 15, 2025

కోదాడ: బనకచర్ల ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం: మంత్రి ఉత్తమ్

image

కోదాడలో ఏర్పాటు చేసిన సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌కు ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.