News April 19, 2025
కామారెడ్డి: కఠిన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయి: SP

నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు పడినప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని KMR జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన కోర్టు డ్యూటీ పోలీసు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. వారెంట్లు, సమన్లు వేగంగా ఎగ్జిక్యూట్ చేసి ట్రయల్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News April 20, 2025
HYD: పీహెచ్డీ కోర్సు వర్క్ పరీక్ష తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్ సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
News April 20, 2025
సూపర్ సండే.. ఇవాళ కీలక మ్యాచ్‌లు

IPLలో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూచండీగఢ్ వేదికగా మ.3.30 గంటలకు PBKSvsRCB, వాంఖడే వేదికగా రా.7.30 గంటలకు MIvsCSK తలపడనున్నాయి. వరుస విజయాలతో పంజాబ్ జోరుమీద ఉండగా సొంత గడ్డపై ఓటములతో ఢీలాపడిన RCB విన్నింగ్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతోంది. ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నైకి నేటి మ్యాచ్ ఎంతో కీలకం. ఓడితే ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టమవుతాయి.
News April 20, 2025
YELLOW ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎండలతో పాటు అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD వెల్లడించింది. APలో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు, ఉ.గో, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. TGలో ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, HYD, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.