News November 1, 2025
కామారెడ్డి: కన్నీటి ‘మొంథా’.. రోడ్డుపైనే రైతన్న నిద్ర

మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. హైవే వెంబడి సర్వీస్ రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవడంతో వాటిని అమ్ముకోలేక, ఇంటికి తీసుకెళ్ల లేక రెండు రోజులుగా రోడ్ల పక్కనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పగలు ధాన్యాన్ని ఆరబెడుతూ, రాత్రివేళ అక్కడే నిద్రపోతున్నారు. పిట్లంలోని హైవే సర్వీస్ రోడ్డుపై ఓ రైతు రాత్రి చలికి పడుకున్న దృశ్యమిది.
Similar News
News November 2, 2025
KNR: ‘రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి’

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు సీఈఓ లోకేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలతో రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పాల్గొన్నారు.
News November 2, 2025
భీమేశ్వర స్వామి ఆలయంలో దీపోత్సవం

కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం శనివారం ఘనంగా ప్రారంభమైంది. 11వ రోజు వేడుకలో భాగంగా ఆలయ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఏఈవోలు శ్రావణ్ కుమార్, అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సేవా సమితి సభ్యులు భక్తి గీతాలు, భజనలతో భక్తులను ఎంతగానో అలరించారు.
News November 2, 2025
ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్

ఎన్నో రహస్యాలకు నెలవైన నింగికి చందమామే అందం. ఆ చంద్రుడు ఈ నెల 5న మరింత పెద్దగా, కాంతిమంతంగా కనివిందు చేయనున్నాడు. ఇది ఈ ఏడాదిలోనే బీవర్ సూపర్ మూన్‌గా నిలవనుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ రోజున జాబిలి భూమికి 356,980KM దగ్గరకు వస్తుందని పేర్కొంటున్నారు. దీన్ని చూడటానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదంటున్నారు. కాగా డిసెంబర్‌లోనూ ఓ కోల్డ్ మూన్ అలరించనుంది.


