News March 18, 2025
కామారెడ్డి కలెక్టరేట్‌కు మళ్లీ రప్పించారు

కామారెడ్డి జిల్లాలో 15మంది తహసిల్దార్లకు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత బదిలీల్లో ప్రేమ్ కుమార్‌ను అధికారులు ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఇంతకుముందు కామారెడ్డి కలెక్టరేట్‌లో విధులు నిర్వహించే ప్రేమ్ కుమార్ డిప్యూటేషన్‌పై ఎల్లారెడ్డి డీఎఓగా పంపగా మళ్లీ అతనినీ అధికారులు కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.
Similar News
News March 18, 2025
వారి పేర్లు తొలగించండి: సీపీఎం

చిత్తూరు: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరులోని రాజకీయ పార్టీ నాయకులతో డీఆర్వో మోహన్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 20వేల మంది మరణించిన వారి పేర్లు ఓటర్ లిస్ట్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని తొలగించమని పదే పదే చెప్పినా.. తీసేయకపోవడం సరికాదన్నారు. ఒకే వ్యక్తి పలు నియోజకవర్గాల్లో ఓటరుగా ఉన్నారని చెప్పారు.
News March 18, 2025
GREAT JOURNEY: బాల్ బాయ్ టు ఐపీఎల్ టీమ్ కెప్టెన్

స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ జర్నీ స్ఫూర్తిదాయకం. 2008 IPL ప్రారంభ ఎడిషన్‌లో MIvsRCB మ్యాచ్‌కు బాల్ బాయ్‌గా ఉన్న అతను 2024లో KKRకు, ఇప్పుడు PBKSకు కెప్టెన్ అయ్యారు. తాజాగా ఆనాటి జ్ఞాపకాలను అయ్యర్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు రాస్ టేలర్, ఇర్ఫాన్ పఠాన్‌తో మాట్లాడినట్లు చెప్పారు. కాగా ఇప్పటివరకు ట్రోఫీ గెలవని పంజాబ్‌కు ఆ కోరిక తీరుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
News March 18, 2025
సైదాపూర్: నీటిసంపులో పడి బాలుడి మృతి

నీటిసంపులో పడి బాలుడు మృతిచెందిన ఘటన సైదాపూర్ మండలం బొమ్మకల్లో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. గ్రామానికి చెందిన ఎలబొయిన సురేశ్-చైతన్యల కుమారుడు ప్రజ్ఞాన్ (2) నీటిసంపులో పడి చనిపోయాడు. రోజువారీలానే పిల్లాడిని ఇంటి వరండాలో ఆడుకోవడానికి వదిలేశారు. ఎంత సేపయినా బాలుడి ఆచూకీ కన్పించకపోవడంతో చుట్టుపక్కల వారి ఇంట్లో వెతికారు. అయినా కన్పించకపోవడంతో సంపులో వెతగ్గా బాలుడి మృతదేహం లభ్యమైంది.