News January 26, 2025
కామారెడ్డి: కలెక్టరేట్లో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కామరెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బాన్సువాడ, రాజంపేట్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు చేసిన ప్రదర్శనలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి విక్టర్, ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి తిలకించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.
Similar News
News December 21, 2025
డిసెంబర్ 21: చరిత్రలో ఈరోజు

✤ 1926: సినీ నటుడు అర్జా జనార్ధనరావు జననం
✤ 1939: నటుడు సూరపనేని శ్రీధర్ జననం
✤ 1959: భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ జననం
✤ 1972: ఏపీ మాజీ సీఎం వై.ఎస్.జగన్ రెడ్డి జననం(ఫొటోలో)
✤ 1972: నటి, నిర్మాత దాసరి కోటిరత్నం మరణం
✤ 1989: నటి తమన్నా భాటియా జననం
News December 21, 2025
యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలి: నిర్మల్ కలెక్టర్

ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన యూరియా యాప్ వినియోగంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులు సులభంగా యూరియా పొందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.
News December 21, 2025
వరంగల్: కనీస వసతులు లేక చలికి వణుకుతున్న విద్యార్థులు!

WGL జిల్లాలో చలి తీవ్రత పెరిగి ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు కనీస వసతులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ SC, ST, BC కళాశాలల్లోని వసతి గృహాల్లో కిటికీలకు తలుపులు లేక తట్టు బస్తాలు అడ్డు కట్టారని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పడకలు లేక నేలపై నిద్రిస్తున్నారని, దుప్పట్లు ఇవ్వలేదని మండిపడుతున్నారు. కాగా, పై చిత్రం WGL రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ వసతి గృహంలోనిది.


