News July 6, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

కామారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటల నుంచి 1 వరకు ఉంటుందని చెప్పారు. ప్రజలు నేరుగా ప్రజావాణికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News July 7, 2025

మాగనూర్: ప్రేమ పేరుతో మోసం… యువకుడిపై కేసు

image

ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకోమంటే యువకుడు మోసం చేసిన సంఘటన మగనూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ బాబు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన నరేశ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లు నమ్మించి గర్భం చేశాడు. పెళ్లి చేసుకోకపోవడంతో నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదైంది.

News July 7, 2025

పాలకోడేరు: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 15 అర్జీలు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

News July 7, 2025

BREAKING: సిద్దిపేట: చేర్యాలలో చైన్ స్నాచింగ్

image

బైక్ ఎక్కించుకుంటానని వృద్ధురాలిని నమ్మించిన ఇద్దరు యువకులు ఆమె మెడలో నుంచి సుమారు నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును అపహరించారు. ఈ ఘటన చేర్యాల మండలం తాడూరు క్రాసింగ్ వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తాడూరు గ్రామానికి చెందిన ఈరు సత్తవ్వ(65) స్వగ్రామానికి వెళ్లడానికి రోడ్డుపై ఉండగా యువకులు లిఫ్ట్ ఇస్తామని చెప్పి బైక్‌పై ఎక్కించుకుని చైన్ స్నాచింగ్ చేసి, మార్గం మధ్యలో ఆమెను వదిలేసి వెళ్లారు.