News December 22, 2025

కామారెడ్డి కలెక్టరేట్‌లో బ్రేస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ప్రారంభం

image

జిల్లా మహిళ సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో తల్లులు పిల్లలకు పాలు ఇచ్చేందుకు తయారు చేసిన బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్‌ను కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి క్యాబిన్‌ల‌ను బస్టాప్‌లలో, రద్దీ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News December 25, 2025

ప.గో: ఆటవిడుపు విషాదాంతం.. నీటిలో విగతజీవిగా బాలుడు

image

పెనుగొండలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని పార్కులో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ అదృశ్యమైన పదేళ్ల బాలుడు.. రాత్రికి సమీపంలోని చెరువులో విగతజీవిగా లభ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన స్థానికులు, చెరువులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News December 25, 2025

త్వరలో కొత్త మెయిల్ ఐడీలు! గూగుల్ కీలక నిర్ణయం

image

త్వరలో జీమెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. కొత్త యూజర్ ఐడీతోపాటు పాత ఐడీ యాక్టివ్‌గానే ఉంటుందని, ఇన్‌బాక్స్ ఒకటేనని తెలిపింది. పాత ఐడీ మళ్లీ పొందాలంటే 12నెలలు ఆగాల్సిందేనని చెప్పింది. జీమెయిల్ అకౌంట్‌తో లింకైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఆధార్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ ఫీచర్‌ దశలవారీగా అమలులోకి వస్తుందని తెలిపింది.

News December 25, 2025

కదిరి: ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

image

కదిరి మున్సిపాలిటీ పరిధిలో కుటాగుళ్ల-పులివెందుల క్రాస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కదిరి రూరల్ పరిధిలోని కాళసముద్రంకు చెందిన రాజును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయిందన్నారు. అధికంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. పోలీసులు విచారణ చేపట్టారు.