News August 22, 2025
కామారెడ్డి: ‘కలెక్టర్ సార్ మాకు ఇల్లు మంజూరు చేయండి’

‘కలెక్టర్ సార్ మాకు ఇల్లు మంజూరు చేయండి’ అని KMR జిల్లాకు చెందిన ఓ కుటుంబం వేడుకుంటుంది. బిక్కనూర్‌కు చెందిన ఆకుల రాజు కుటుంబం కొన్నేళ్లుగా సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు. రాజు లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. అతనికి ముగ్గురు ఆడపిల్లలు. ఇప్పటికీ సొంతిల్లు లేదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని వాపోయారు. మండల స్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.
Similar News
News March 7, 2026
డిజిటల్ ఫ్రాడ్‌కు ₹25,000 పరిహారం!

₹50,000 లోపు సైబర్ మోసం జరిగితే కస్టమర్ పొరపాటు ఉన్నా ఒకేసారి గరిష్ఠంగా ₹25,000 వరకు పరిహారం అందించేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 5 రోజుల్లోపు కంప్లైంట్ చేస్తే ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. APR 6 వరకు ఈ ప్రతిపాదనలపై బ్యాంకులు అభిప్రాయం తెలియజేయొచ్చు. ఇవన్నీ ఓకే అయితే జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. సామాన్య కస్టమర్ల కష్టార్జితానికి రక్షణ కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం.
News March 7, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 7, 2026
భీమ్‌గల్: UPSC 259 ర్యాంకర్ వర్షిత్ రెడ్డి నేపథ్యమిదే!

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం ముచ్కూర్‌కు చెందిన శనిగరం వర్షిత్ రెడ్డి UPSCలో ఆల్ ఇండియా <<19313450>>259వ ర్యాంకు<<>> సాధించారు. ఆయన తల్లిదండ్రులు నవీన్ రెడ్డి-కవిత(వ్యాపారస్థులు) హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వర్షిత్ రెడ్డి 2023లో హైదరాబాద్ బిట్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం విజయవాడలో కస్టమ్స్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్ పరీక్షల్లో మూడో ప్రయత్నంలో విజయం సాధించారు.


