News October 11, 2025
కామారెడ్డి: ‘కల్లుగీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి’

కల్లుగీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘ అధ్యక్షుడు వెంకట రమణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి పానీయమైన నీరా, కల్లును ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
Similar News
News October 11, 2025
కల్తీ కాఫ్ సిరప్‌లపై US ఆరా

మన దేశంలో 22 మంది పిల్లల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందులపై US ఆరా తీసింది. కోల్డ్రిఫ్ సిరప్ అమెరికా సహ ఏ దేశానికీ పంపలేదని US FDAకు CDSCO (IND) తెలిపిందని రాయిటర్స్ పేర్కొంది. పరిమితికి మించి 500 రెట్ల విషపూరితమైన కాఫ్ సిరప్ వల్ల పిల్లలు మరణించారని తెలిపింది. ‘ఆ మందులు USలోకి రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడకి వచ్చే మందులు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని చెప్పాం’ అని FDA పేర్కొన్నట్లు వివరించింది.
News October 11, 2025
అంతర్వేదిలో నటుడు సునీల్ సందడి

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సునీల్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను సునీల్‌కు అందజేశారు.
News October 11, 2025
తిరుపతి: మురికి కాలువలో 6 నెలల చిన్నారి

తిరుపతి సింగాలగుంట మసీదు వీధిలో శనివారం విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 6 నెలల చిన్నారిని మురికి కాలువలో స్థానికులు గుర్తించారు. వెంటనే సానిటరీ సిబ్బందికి అలాగే వీఆర్వోకి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని చిన్నారిని బయటికి తీశారు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా.. కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.