News August 24, 2025
కామారెడ్డి: కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలి

పెండింగులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని జిల్లా న్యాయ సేవా అథారిటీ ఛైర్మన్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో సాధ్యమైన అన్ని కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొన్నారు.
Similar News
News August 24, 2025
భద్రకాళి అమ్మవారి దివ్యదర్శనం

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఆదివారం ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు, తదితరులున్నారు.
News August 24, 2025
KNR: ఇప్పటికైనా వీటికి పరిష్కారం పక్కానా..?

KNR(D) గంగాధర మం.లో ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ నేతలు నేడు పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి KNR జిల్లాలో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలెన్నో ఉన్నాయి. వేములవాడ, కొండగట్టు, దర్మపురి, తదితర ఆలయాల అభివృద్ధి, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్, KNR- JGTL రోడ్డు విస్తరణ, నారయణపూర్ భూనిర్వాసితుల సమస్యతోపాటు ఎన్నో అపరిష్కృత ఇబ్బందులను తీర్చాలని ఉమ్మడి జిల్లావాసులు కోరుతున్నారు.
News August 24, 2025
తిరుపతిలో ఓ జంట సూసైడ్

తిరుపతిలోని గ్రూప్ థియేటర్స్ ఎదురుగా ఉన్న లాడ్జిలో ఓ జంట ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతులు కర్ణాటక రాష్ట్రం చామరాజ్ నగర్‌కు చెందిన వెంకటరాజు, అనూషగా గుర్తించారు. వీరు ఇటీవల ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి వచ్చినట్టు తెలుస్తోంది. మృతదేహాలను గుర్తించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు బంధువులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని ఎస్సై హేమాద్రి తెలిపారు.