News February 12, 2025
కామారెడ్డి: క్వింటాకు రూ.7550 చెల్లిస్తాం: మార్కోఫెడ్ జిల్లా మేనేజర్

కందులు క్వింటాకు మద్దతు ధర రూ.7,550 చెల్లిస్తామని మార్కోఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 56,189 ఎకరాల్లో కంది పంటను సాగు చేయడంతో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, బోర్లం, తాడ్వాయి, గాంధారి, పద్మాజీవాడి వద్ద కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News July 7, 2025
VJA: త్వరలో రైతులకు యాన్యుటీ నగదు

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం అందించే వార్షిక యాన్యుటీ (కౌలు) చెల్లించేందుకు విజయవాడలోని CRDA అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. జరీబు, మెట్ట భూమి ఇచ్చిన వారికి ఇచ్చే కౌలును ప్రభుత్వం మరో 5ఏళ్లు పొడిగించిన నేపథ్యంలో రైతుల ఖాతాలలో నగదు జమ చేసేందుకు అర్హుల జాబితాలు రూపొందించే ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటి వరకు 10ఏళ్ల పాటు రైతులకు ప్రభుత్వం ఏటా కౌలు అందజేసింది.
News July 7, 2025
కంది: ఐఐటీహెచ్ డైరెక్టర్ పదవీ కాలం పెంపు

కందిలోని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల పెంచుతూ కేంద్ర విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పొడిగించడం ఆనందంగా ఉందన్నారు. ఐఐటీహెచ్‌లో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
News July 7, 2025
టేస్టీ ఫుడ్: వరల్డ్‌లో హైదరాబాద్‌కు 50వ స్థానం

రుచికరమైన వంటకాల్లో బెస్ట్ సిటీ మన హైదరాబాద్ అని మరోసారి నిరూపితమైంది. టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ ఫుడ్ లభించే నగరాల్లో HYDకు 50వ స్థానం దక్కింది. HYD బిర్యానీ, హలీమ్, ఇరానీ ఛాయ్, తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ, మొఘల్, టర్కిష్ రుచులు సిటీలో ఏ మూలకు వెళ్లిన లభిస్తాయి. అందరికీ అందుబాటులోనే ధరలు ఉండటం విశేషం. మరి సిటీలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏది? కామెంట్ చేయండి.