News November 18, 2025
కామారెడ్డి: ‘గణిత అధ్యాపకుడి కోసం దరఖాస్తు చేసుకోండి’

బిక్కనూర్ మండలం సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పార్ట్ టైం ప్రాతిపాదికన గణిత శాస్త్రం బోధించేందుకు అర్హులైన వారు ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రఘు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎంపికైన అధ్యాపకుడికి రూ.23,400 వేతనం ఇస్తామని, అభ్యర్థులు MSC MATH B.ED/M.ED చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
Similar News
News November 18, 2025
ఉల్లాసంగా యూనిటీ ర్యాలీ.. పాల్గొన్న కేంద్రమంత్రి

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సర్దార్ @ 150యూనిటీ ర్యాలీ ఉల్లాసంగా సాగింది. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, MLC అంజిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఎస్పీ మహేష్ బీ గితే, వందలాది మంది యువత బతుకమ్మ ఘాట్ నుంచి కొత్తచెరువు వరకు నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు. దేశ ఐక్యతకు పాటుపడతామని ఈ సందర్భంగా యువత ప్రముఖులతో ప్రతిజ్ఞ చేసింది.

విధుల్లో ఉండగా గుండెపోటు.. హాస్టల్ వంటమనిషి మృతి

వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్ బీసీ సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న CH.మహేశ్వరి(50) గుండెపోటుతో కన్నుమూశారు. 15 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న ఆమె మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దినెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆమె మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.