News January 15, 2026
కామారెడ్డి: గాలిపటాల జోష్.. రోడ్లపై డెత్ రేస్!

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది. అయితే, ఈ సరదా కాస్తా ఒక్కోసారి పెను ప్రమాదాలకు దారితీస్తోంది. గాలిపటం తెగిపోగానే దానిని పట్టుకోవాలనే తాపత్రయంతో చిన్నారులు ప్రాణాలకు తెగించి రోడ్ల వెంట పరుగు పెడుతున్నారు. పండుగ పూట విషాదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ వాసులు మీ పిల్లలు జాగ్రత్త.
Similar News
News February 20, 2026
సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 20, 2026
గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి కట్టడికి సూచనలు

గొర్రెలకు నీలి నాలుక వ్యాధి సోకకుండా ఉండాలంటే వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమలను కట్టడి చేయాలి. దీని కోసం ప్రతి రోజూ ఎండిన వేపాకులతో పొగ పెట్టాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరుచేస్తే మిగతా వాటికి వ్యాధి వ్యాపించదు. గొర్రెల షెడ్‌ను పొడిగా ఉంచాలి. వ్యాధి సోకిన గొర్రెలను వెటర్నరీ డాక్టరుకు చూపించి అవసరమైన మందులు వాడాలి. వ్యాధి కట్టడికి ప్రభుత్వం అందించే టీకాలను గొర్రెలకు వేయించాలి.
News February 20, 2026
అనకాపల్లి: ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 16 అర్జీలు

అనకాపల్లి కలెక్టరేట్‌లో ఉద్యోగుల సమస్యలపై శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3వ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారానికి అవకాశం గల ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


