News December 16, 2025

కామారెడ్డి: గుండెల్లో దడ.. లెక్కలు నిజమవుతాయా?

image

జిల్లాలో 3వ విడత GPఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. తమ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో తెలియక, సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓటరు నాడి అంచనాకు దొరకకపోవడంతో, ఎవరు గెలుస్తారో? ఎవరు ఓడిపోతారో? అని వారి గుండెల్లో దడ మొదలైంది. తాము వేసిన లెక్కలు నిజమవుతాయా? అనే అనుమానం కూడా అభ్యర్థులను వెంటాడుతోంది.

Similar News

News December 23, 2025

వీరఘట్టం: విద్యుత్ స్తంభాలను ఢీ కొన్న బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల తెలిపిన సమాచారం మేరకు.. ఖడ్గవలస నుంచి బులెట్ బైక్‌పై వీరఘట్టంకు చెందిన బంగారం వ్యాపారి కోణార్క్ శ్రీను మరో వ్యక్తితో కలిసి వస్తుంగా కడకెల్ల వద్ద రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వైద్యం కోసం పార్వతీపురం తరలించారు.

News December 23, 2025

అన్నమయ్య జిల్లాలో 19 మంది ఎస్సైల బదిలీ

image

అన్నమయ్య జిల్లాలో 19 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజంపేట UG Ps నుంచి వేంకటేశ్వర్లను మదనపల్లె వన్ టౌన్ UG Ps- 2 కు బదిలీ చేశారు. అన్నమయ్య హెడ్ క్వార్టర్ నుంచి పి. శ్రావణిని పెద్దముడియంకు, జి. శోభను LR పల్లెకు, డి. రవీంద్రబాబును LR పల్లె నుంచి పెద్దముడియంకు, సీ. ఉమామహేశ్వర్ రెడ్డిని తంబళ్లపల్లె నుంచి DCRBకి బదిలీ చేశారు.

News December 23, 2025

‘గట్టమ్మ’ వివాదం ఇక ముగిసినట్టే..!

image

మేడారం భక్తుల చేత తొలి మొక్కులు అందుకుంటున్న గట్టమ్మ ఆలయం హక్కులు, ఆదాయం విషయంలో జాకారం ముదిరాజ్‌లు, ములుగు నాయకపోడుల మధ్య ఏళ్ల కాలంగా వివాదం ఉంది. కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. నాయకపోడ్‌లపై దాడికి పాల్పడ్డారని ముదిరాజ్‌లపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలో చేర్చారు. షాపుల ఏర్పాటుకు టెండర్లు జరుపుతున్నారు. దీంతో ‘గట్టమ్మ’ హక్కుల వివాదం ముగిసినట్టేనని స్పష్టమవుతోంది.